బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కరుణ భూషణ్ ఒకరు. యువ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన కరుణ శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా బుల్లితెర సీరియల్స్ చేస్తూనే వెండి తెరపై కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ఇక చివరికి ఈమె అరవింద సమేత సినిమాలో ఆఖరిగా సందడి చేశారు.
ప్రస్తుతం వైదేహి పరిణయం అనే సీరియల్ లో నటిస్తూ కరుణ (Actress0 ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె షూటింగ్ లోకేషన్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ముఖ్యంగా తన కొడుకు గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా నేటిజెన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి.
తన కుమారుడితో తాను చాలా ఫ్రెండ్లీగా ఉంటానని కరుణ తెలియజేశారు. ఇక తన కుమారుడు కూడా గ్లామరస్ విషయంలో తనకు పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారని కరుణ తెలిపారు. తాను ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే అది నాకు ఎలా ఉందో నిర్మొహమాటంగా చెబుతాడు. బాగుంటే బాగుంది లేకపోతే బాలేదని చెబుతాడని తెలియజేశారు. ఇక తను కాస్త హాట్ డ్రెస్ కనుక వేసుకుంటే చాలా sayక్సీగా ఉన్నావు అని కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారని తెలిపారు.
ఇలా కన్న కొడుకు తల్లిని sayక్సీగా ఉన్నావు అని చెబుతారంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసలు పిల్లలని పెంచే పద్ధతి ఇదేనా ఒక కన్నా కొడుకు తల్లిని సెక్సీగా ఉన్నావు అని చెప్పడం ఏంటి పైగా దానిని మీడియా ముందు చెప్పుకోవడం దరిద్రం అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన కొడుకు గురించి ఈమె గొప్పగా చెప్పుకోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.