Mahalakshmi: భర్త జైల్లో ఉంటే మహాలక్ష్మి చేసిన పనికి షాక్ అవుతున్న నేటిజన్స్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రవీందర్ చంద్రశేఖర న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఈయన గత ఏడాది నటి మహాలక్ష్మిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కుందనపు బొమ్మల ఉన్నటువంటి ఈమె అధిక శరీర ఖాయం కలిగినటువంటి రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

మహాలక్ష్మి కేవలం రవీందర్ డబ్బు చూసి మాత్రమే ఆయనని పెళ్లి చేసుకుందని ఆయనపై ఏ విధమైనటువంటి ప్రేమ లేదని భారీగా విమర్శలు చేశారు. అయితే రవీందర్ మహాలక్ష్మి దంపతులు మాత్రం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉందని ఇద్దరు ఒకరికొకరు కానుకలు ఇచ్చుపుచ్చుకోవడం ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు. ఇకపోతే తాజాగా రవీందర్ ఓ కేసులో భాగంగా అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా అరెస్టు కావడంతో మహాలక్ష్మి (Mahalakshmi) అసలు రంగు బయటపడింది అంటూ కొందరు ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. మహాలక్ష్మి తన భర్త రవీందర్ జైలుకు వెళితే తనకు బెయిల్ కోసం పోరాడాలి కానీ ఈమె మాత్రం అందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా చీర కట్టులో ఎంతో అందంగా ముస్తాబయి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె షేర్ చేశారు.

ఇలా అందంగా తయారవ్వడం తప్పు కాదు కానీ భర్త ఇలా జైల్లో ఉంటే ఏమాత్రం తనకు బాధ లేదు అన్న విధంగా ఈమె సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో కొందరు ఈమెపై ట్రోల్స్ చేయడమే కాకుండా రవీందర్ జైలు పాలు అవ్వడానికి ఈమె కారణం అంటూ కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రేమతో పెళ్లి చేసుకుంటే భర్త కోసం పోరాటం చేయాలి కానీ భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం సంతోషంగా గడుపుతున్నారని కేవలం డబ్బు కోసమే ఈమె అతన్ని పెళ్లి చేసుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus