రేటింగ్ కోసం ఈ చీఫ్ ట్రిక్స్ మానరా.. మల్లెమాలను ఏకిపారేస్తున్న నెటిజన్స్!

ఈటీవీలో ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసే కార్యక్రమాలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను మల్లెమాలవారు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలం నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా కొన్నిసార్లు ప్రేక్షకుల ఆగ్రహానికి కూడా గురవుతూ ఉంటారు. సాధారణంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమం మంచి రేటింగ్ సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.

అయితే మల్లెమాలవారు మరి దారుణంగా రేటింగ్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రోమోలు కట్ చేస్తూ విడుదల చేస్తుంటారు. అయితే ఇవి చూసిన ప్రేక్షకులు నిజంగానే ఏదో జరిగిపోయిందని ఆత్రుతగా పూర్తి ఎపిసోడ్ చూసిన అందులో ఏమీ ఉండదు చివరికి ప్రేక్షకులను ఫూల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి స్టంట్ లుఎన్నో చేసి పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యారు.ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో నిర్వహించే టాస్కులను ఇక్కడ కూడా ప్రారంభించారు. కొందరి ఫోటోలను టేబుల్ పై పెట్టి నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చి వేయమని చెప్పగా అందరూ హైపర్ ఆది ఫోటోను చింపి వేశారు. ఈ ప్రోమో ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులు మరోసారి మల్లెమాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మీ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఆపేయరా.. మీరు మారరు అంటూ పెద్ద ఎత్తున మల్లెమాల వారిపై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు అయ్యయ్యో వద్దమ్మా ఇప్పటికే ఇలాంటివి చాలా చూసాము మళ్లీ అంటే కష్టం అంటూ ఓ రేంజ్ లో మల్లెమాల వారిపై ట్రోల్స్ చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus