నెటిజనుల దెబ్బకి ఫోటో తీసేసిన బెల్లంకొండ

సోషల్ మీడియాలో అందరూ సమానమే. సామాన్యుడు చేసిన తప్పునైనా పట్టించుకోరేమోగానీ.. సెలబ్రిటీ అయితే మాత్రం.. నెటిజనులు ఓ ఆట ఆడుకుంటారు. ఆ విషయం మరోసారి రుజువైంది. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. జయ జానకి నాయక వంటి సినిమాతో మాస్ అభిమానులను ఏర్పరుచుకున్నారు. అదే రూట్ లో సాక్ష్యం చేసినప్పటికీ అది సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. అలాగే మరో మూవీ కూడా చేస్తున్నారు. ఆ షూటింగ్ నిమిత్తం థాయిలాండ్ వెళ్లారు. అక్కడ అడవుల్లో షూట్ లో పాల్గొన్నారు.

అక్కడి విషయాలను అభిమానులకు చెప్పుకోవాలని ఏనుగు దంతాలపై కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేశారు. అభినందనలు వస్తుందని ఆశపడ్డ అతనికి విమర్శలు వెల్లువెత్తాయి. జంతువులను ఇలా హింసిస్తారా? ఏనుగు ఎంత బాధపడుతుంది? కొంచెం కూడా జాలి లేదా?.. అంటూ నెటిజనులు బెల్లంకొండపై విరుచుకుపడ్డాయి. అన్ని వర్గాల ప్రజలనుంచి ఈ ఫోటోపై వ్యతిరేకత రావడంతో వెంటనే ఫోటోని తొలిగించారు. అయినా విమర్శలు ఆగడం లేదు. ఈ సంఘటన ద్వారా జంతువులపట్ల ప్రేమతో ఉండాలనే సందేశం ఎక్కువమంది చేరిందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus