సోషల్ మీడియాలో రకుల్ ని తిట్టిపోస్తున్న జనాలు

సోషల్ మీడియా అనేది ఒక సాలీడు గూడు లాంటిది. ఈ గుడులో చిక్కుకోకుండా దాన్ని ఆసరా చేసుకొని ఎదగాలి కానీ.. ప్రలోభాలకు లొంగి కిందపడకూడదు. ఒక్కోసారి చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేవాళ్లని కూడా కోపోద్రిక్తులను చేస్తుంది సోషల్ మీడియా. తాజాగా సోషల్ మీడియా బుల్లీయింగ్ కారణంగా టెంపర్ కోల్పోయి కోపంతో వేసిన ట్వీట్ కి రకుల్ ఫీలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం “సిక్ మైండ్ రకుల్” అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ హైద్రాబాద్ లో ట్రెండ్ అవుతుంది.

విషయం ఏంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ షార్ట్ ప్యాంట్ వేసుకొని కార్ లో నుంచి దిగుతున్న ఫోటోను ఒక వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ “వెన్ షీ ఫర్గెట్ టు వేర్ హెర్ పాంట్ ఆఫ్టర్ ది సెషన్ ఇన్ కార్” (కార్ లో శృంగారంలో పాల్గొన్నాక ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి అమ్మాయి కారు దిగితే ఇలాగే ఉంటుంది) అని రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను పోస్ట్ చేసి కామెంట్ పెట్టాడు. దీనిపై రియాక్ట్ అయిన రకుల్ చాలా కోపంగా.. “నాకు తెలిసి మీ అమ్మ ఇలాంటి సెషన్స్ (కారులో శృంగారం) చేస్తుందేమో, అందుకే నువ్వు ఇంత ఎక్స్ పర్ట్ అయ్యావ్. ఈ కార్ సెషన్స్ గురించి మాత్రమే కాక మీ అమ్మ నుంచి కాస్త సెన్స్ నేర్చుకో. ఇలాంటి మనుషులు ఉన్నంతవరకూ ఆడపిల్లలకు సేఫ్టీ లేదు” అని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది రకుల్.

అయితే.. తీడితే ఆ కుర్రాడ్ని తిట్టాలి కానీ ఇలా అమ్మను మధ్యలో తీసుకురావడం ఏంటీ, అసలు బుద్ది ఉందా అని నెటిజన్లు రకుల్ పై విరుచుకుపడడం మొదలెట్టారు. వెంటనే “సిక్ మైండ్ రకుల్” అని హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు కూడా. ఈ విషయమై రకుల్ మళ్ళీ స్పందిస్తూ.. “నన్ను ప్రశ్నించే ముందు వాళ్ళు ఎలా కామెంట్ చేశారనేది చూడండి. ఆ ట్వీట్ చూస్తే వాళ్ళ అమ్మ కూడా కొడుతుంది” అని రిప్లై ఇచ్చినప్పటికీ.. ఇప్పుడప్పుడే ఈ వేడి తగ్గేలా కనిపించడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus