మన్మథుడని ఊరికే అంటారా..? నెటిజన్ల కామెంట్లు!

టాలీవుడ్ హీరో నాగార్జునను అభిమానులంతా మన్మథుడని పిలుచుకుంటారు. అప్పట్లో అమ్మాయిల్లో నాగ్ అంటే అంత క్రేజ్ ఉండేది. ఇప్పటికీ కూడా తన ఇద్దరు కొడుకులకు ఉన్న లేడీ ఫ్యాన్స్ కంటే నాగ్ ఫ్యాన్స్ లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఓ సీన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నోయల్ ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అంటూ బిగ్ బాస్ స్టేజ్ పై నోయల్ కి దూరంగా నిల్చున్నాడు.

తను షూటింగ్ కోసం వేరే ప్రదేశాలకు వెళ్లి వచ్చానని.. కాబట్టి దూరంగా ఉంటే బెటర్ అంటూ వివరించారు నాగ్. ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం కులుమనాలి వెళ్లిన నాగ్.. బిగ్ బాస్ షో కోసం తిరిగి వచ్చారు. తాను బయటకి వెళ్లి రావడం వలన సోషల్ డిస్టెన్స్ అవసరమని బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. గతవారం ఎలిమినేట్ అయిన దివి.. నాగార్జునను కలిసింది.

ఈ సందర్భంగా నాగార్జున-దివి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ ఫోటోలో నాగార్జున-దివి ఇద్దరూ దగ్గరగా ఉండడం.. దివి భుజంపై నాగర్జున చేయి వేసి ఫోటోకి ఫోజివ్వడంతో ఇది కాస్త వైరల్ అయింది. నెటిజన్లంతా నాగ్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మగాళ్లతోనేనా..? ఆడవాళ్లతో అవసరం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నాగార్జునను మన్మథుడని అనడానికి ఇదే నిదర్శనమంటూ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus