Vairamuthu: ప్రేమకు వయసు అడ్డు కాదు.. వైరముత్తు కాన్సెప్ట్ పై విమర్శలు!

కోలీవుడ్ కు చెందిన ప్రముఖ గేయ రచయిత వైరముత్తుకి గొప్ప ఫాలోయింగ్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. సింగర్ చిన్మయి ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా వైరముత్తుపై చేసిన ఆరోపణలు ఆయన ఇమేజ్ ని బాగా దెబ్బ తీశాయి. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ జనాల్లో అతడిపై చెడు అభిప్రాయం ఏర్పడింది. ఒక్క చిన్మయి మాత్రమే కాకుండా చాలా మంది వైరముత్తుపై పలు ఆరోపణలు చేయడంతో అందులో కొన్నయినా నిజాలున్నాయనే భావన చాలా మందిలో కలిగింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు వైరముత్తు చేపట్టిన ఒక ప్రాజెక్ట్ విమర్శల పాలవుతోంది. ‘నాట్పదు తెరల్’ పేరుతో వంద పాటల ప్రాజెక్ట్ లో వైరముత్తు భాగమయ్యారు. ఇందులో భాగంగా ఆయన వంద ప్రేమ గీతాలు రాస్తున్నారు. ప్రతి పాటకి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంటుంది. ఆ విధంగా ఒక్కో పాటను వీడియోగా రూపొందించి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ‘ఎన్ కాదలా’ అనే పేరుతో ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో బాలనటిగా కనిపించిన అనికా సురేంద్రన్ నటించింది.

తనకంటే రెట్టింపు వయసునున్న ఓ వ్యక్తిని చూసి పదహారేళ్ల అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఇదే కాన్సెప్ట్ తో పాటను రూపొందించారు వైరముత్తు. లిరిక్స్ లో ప్రేమకు వయసు అడ్డు కాదంటూ కొన్ని లైన్స్ రాశారు. పైగా అమ్మాయి ప్రేమించేది ఓ కవిని కావడంతో.. అందరూ వైరముత్తు జీవితాన్ని రిలేట్ చేసుకుంటున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లను వైరముత్తు లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. తన ఆలోచనలను పరోక్షంగా ఈ పాట ద్వారా చెబుతున్నాడని.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తరువాత కూడా ఆయనలో మార్పు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus