Chinmayi: మహిళలందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపొండి.. చిన్మయి కామెంట్స్ వైరల్!

  • August 7, 2023 / 06:00 PM IST

సింగర్ చిన్మయి మహిళ పక్షపాతిగా మహిళలను ఉద్దేశిస్తూ ఈమె చేసే కామెంట్ల ద్వారా తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈ వివాదాల ద్వారా ఈ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఏ సమస్య వచ్చిన వెంటనే చిన్మయి తన గలాన్ని విప్పుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈమె చేసే కామెంట్లపై విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఈ విధంగా చిన్మయి ఇప్పటివరకు ఎన్నోసార్లు నేటిజన్లో ట్రోలింగ్ కి గురవుతూ వచ్చారు.

తాజాగా మరోసారి నేటిజన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.ఈ విధంగా చిన్మయి పట్ల నెటిజన్స్ ఇలాంటి ట్రోల్స్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈమె కెనడాకు చెందిన ఓ యువతకి మద్దతుగా నిలబడటమే అందుకు కారణమని చెప్పాలి. ఇండియాకు చెందినటువంటి ఓ మహిళ కెనడాలో స్థిరపడ్డారు ఇలా కెనడాలో స్థిరపడినటువంటి ఈమెను ఇండియా వదిలి ఎందుకు ఇక్కడ స్థిరపడ్డారన్న ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు మహిళ సమాధానం చెబుతూ ఇండియా వదిలి రావడం నాకలా అని సమాధానం చెప్పారు. ఇక్కడ మీకు నచ్చినది ఏంటి అని అడగడంతో కెనడాలో ఎంతో స్వేచ్ఛంగా బ్రతకచ్చు అంటూ ఆ మహిళ చెప్పినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన చిన్మయి ఆమెకు మద్దతు తెలుపుతూ పరాయి దేశంలో కూడా ఆమె స్వేచ్ఛగా ఉంటుంది. ఆమె (Chinmayi) చెప్పినది వింటే అందరికీ బోధపడుతుంది.

ఆమె ఇండియా వదిలేసి వెళ్లిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇండియాలోనే మహిళలందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోండి అంటూ ఈమె ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారడంతో నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.మరి మీరు కూడా వెళ్లిపోవచ్చుగా ఇక్కడే ఎందుకు ఉన్నారు డబ్బులు సంపాదించడం కోసమే ఇండియాలో ఉంటున్నారా అంటూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus