Dhanush: ఐఎండీబీ ర్యాంకులు నిజమేనా.. ధనుష్ కు క్రేజ్ ఎక్కువా?

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్ లకు గుర్తింపు ఉంది. హరిహర వీరమల్లు సినిమాతో పవన్, రాజమౌళి సినిమాతో మహేష్ కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరనున్నారనే సంగతి తెలిసిందే. శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి యశ్, రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోల జాబితాలో ఉన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలకు ఇతర రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్నా ఈ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాల్సిఉంది.

బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, కాంతార, పుష్ప తరహాలో సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన సినిమాలను ఎంచుకునే విషయంలో కోలీవుడ్ హీరోలు ఫెయిల్ అవుతుండటం ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. పొన్నియన్ సెల్వన్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ భావించినా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. తమిళనాడులో మాత్రమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఐఎండీబీ టాప్ 10 పాపులర్ స్టార్స్ జాబితాలో ధనుష్ కు తొలి స్థానం దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో ధనుష్ హీరోగా నటించి అన్ని భాషల్లో హిట్టైన సినిమాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. ధనుష్ కొత్త సినిమా విడుదలైనా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు పట్టించుకోరు. టాప్10 జాబితాలో టాలీవుడ్ కు చెందిన కొందరు పాపులర్ స్టార్స్ కు ఛాన్స్ దక్కకపోవడం కూడా ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది.

ఐఎండీబీ క్రెడిబులిటీనే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతోందని కొంతమంది చెబుతున్నారు. ధనుష్ నంబర్ వన్ స్థానంలో నిలవడం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ధనుష్ గ్రేట్ యాక్టర్ అని అంగీకరిస్తామని అయితే మరీ నంబర్ వన్ స్థానంలో నిలిచే స్థాయి యాక్టర్ అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus