ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు ఫేవరెట్ గా మారారు. కొంతమంది స్టార్ హీరోలు సైతం థమన్ ను తమ సినిమాలకు తీసుకోవాలని దర్శకులకు సూచిస్తున్నారు. గత రెండేళ్లలో థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో థమన్ స్థాయి పెరిగింది. థమన్ క్రేజ్ ను చూసి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు సైతం అవాక్కవుతున్నారు.
అఖండ సినిమాకు థమన్ బీజీఎం ప్లస్ కావడంతో పాటు బీజీఎం వల్లే ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. అయితే సర్కారు వారి పాట సాంగ్స్, బీజీఎం విషయంలో థమన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు వారి పాటకు థమన్ మైనస్ అయ్యారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. థమన్ ఈ కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
మరో 75 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. వీకెండ్ నాటికి సర్కారు వారి పాట ఫైనల్ రిజల్ట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దర్శకుడు పరశురామ్ సెకండాఫ్ లోని సీన్లను మరింత బాగా తెరకెక్కించి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేదని కామెంట్లు వస్తున్నాయి. సర్కారు వారి పాట విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ సర్కారు వారి పాట డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఓటీటీలో ఈ సినిమాను చూడాలంటే ఎక్కువకాలం ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. నెలరోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!