Anasuya: నెటిజన్ల కామెంట్లు.. అనసూయ ఘాటు రిప్లై!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. మరోపక్క వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు జడలు వేసుకొని.. చిన్న పిల్లలా పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది అనసూయ. ‘నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలానే ఉన్నాను’ అంటూ ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. స్కూల్ బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయావ్ అంటూ కొందరు సెటైర్లు వేశారు. ఓ నెటిజన్ అయితే.. కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీని గురించి నీకు కాస్త కూడా బాధ లేదా..? ఇలాంటి సమయంలో ఈ ఫోటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు. ఇది చూసిన అనసూయ ఘాటు బదులిచ్చింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి మేం ప్రయత్నిస్తున్నారంటూ సమాధానమిచ్చింది.

అనసూయ సమాధానంతో సంతృప్తి చెందని సదరు నెటిజన్.. ఈ సమయంలో జనాలకు కావాల్సింది చేయిత తప్ప వినోదం కాదని.. ఓ పక్క జనాలందరూ కరోనా వలన తీవ్ర ఇబ్బందులు పడుతూ చనిపోతుంటే వారిని ఇలా ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ అని ఎలా సమర్ధించుకుంటున్నావంటూ మండిపడ్డాడు. దీంతో అనసూయ ఫ్యాన్స్ ఎంటర్ అయి.. సదరు నెటిజన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వెందుకు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావ్ అంటూ నిలదీశారు. అయినా.. అనసూయకి ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. గతంలో ఆమె చాలా సార్లు ట్రోలింగ్ కి గురైంది. ఇలాంటి విషయాలను ఆమె పెద్దగా పట్టించుకోదు!

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus