బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం కెప్టెన్సీకి పెద్ద యుద్ధమే జరిగింది. ఈసారి బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ బదులుగా ఓడిపోయినా వాళ్లని వాలంటీర్స్ గా ఆడించమని కండీషన్ పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఆటలో డెడ్ అయ్యాడు కాబట్టి ఆడటానికి వీల్లేదని చెప్పాడు. దీంతో ఒక ప్లేయర్ తక్కువయ్యాడు. శివాజీ సలహాతో యావర్ గేమ్ నుంచీ తప్పుకున్నాడు. ఇక గౌతమ్ కోసం ఆడతానని పంతం పట్టి కూర్చుంది అశ్విని. నిజానికి అర్జున్ తరపున ఆడమని చెప్పాడు.
ఎందుకంటే, శివాజీకి చేయి బాలేదు కాబట్టి గౌతమ్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి ముందు తీసేద్దామని శివాజీ గ్రూప్ ప్లాన్ వేసింది. దానికి తగ్గట్లుగానే ఆపోజిట్ టీమ్ ప్లేయర్స్ ని సెలక్ట్ చేస్కుంది. ఇక్కడే బిగ్ బాస్ కండీషన్ మేరకు వాళ్లని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. గెలిచినా కూడా సుఖం లేకుండా పోయింది వీరసింహాలు టీమ్ కి. గౌతమ్ బదులుగా అశ్విని, శోభాశెట్టికి అమర్, రతిక కోసం భోలేషవాలి, తేజ కోసం ప్రియాంక, అర్జున్ కోసం శివాజీ బరిలోకి దిగారు.
ఎప్పుడు ప్రతి సీజన్ లో ఇచ్చే బీమ్ బ్యాగ్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. గోణుసంచీని భుజాలకి తగిలించుకుని సర్కిల్ లో తిరగాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో వేరేవాళ్ల బ్యాగ్ ని డిస్టర్బ్ చేయాలి. అందులో ఉన్న థర్మాకోల్స్ అన్నీ కిందపడేలా గేమ్ ఆడాలి. ప్రతి సీజన్ లో ఈ టాస్క్ ని ఆడియన్స్ చూసినా ఈసారి మాత్రం వేరేవాళ్ల కోసం ఆడుతున్నారు కాబట్టి ఆసక్తిగా చూశారు. ఈ టాస్క్ లో అమర్ దీప్ రెచ్చిపోయాడు.
అమర్ దీప్ పూనకం వచ్చినట్లుగా గేమ్ ని స్టార్ట్ చేశాడు. బోలేపై, అశ్వినిపై విరుచుకుపడ్డాడు. ఫస్ట్ నుంచీ కూడా రతిక- భోలే పై అమర్ కి కోపం ఉంది. ఈ కోపాన్ని ఒకేసారి తీర్చుకుని టాస్క్ దొరికిందన్నమాట. ఇక వదులుతాడా విశ్వరూపం చూపించాడు. అశ్విని సంచీని లాగే క్రమంలో అమర్ ముఖంపై కొట్టింది. ఆ తర్వాత అమర్ అశ్విని భుజాన్ని కొట్టాడు. అలా దెబ్బలతోనే గేమ్ ని కంటిన్యూ చేశారు. సంచాలక్ గా ప్రశాంత్ ఈ టాస్క్ ని బాగానే డీల్ చేసినా, వాళ్లు ఫిజికల్ అవ్వకుండా మాత్రం ఆపలేకపోయాడు.
దీంతో మాటల యుద్ధం జరిగింది. రతిక అయితే శాడిస్ట్ లాగా, బ్యాడ్ బాయ్ గాలా బిహేవ్ చేస్తున్నావ్, గేమ్ ఆలా ఆడుతున్నావ్ అంటూ అమర్ ని మరింత రెచ్చగొట్టింది. దీంతో రతికకి మాటకి మాట అప్పజెప్తూనే యాటిట్యూడ్ చూపిస్తూ అమర్ భోలేపై విరుచుకునిపడ్డాడు. ఫస్ట్ రౌండ్ లో అశ్విని అవుట్ అయ్యింది. ఆతర్వాత రౌండ్ లో భోలేషవాలి అవుట్ అయ్యాడు. ఇక అవుట్ అవుతూ భోలే చిన్నపిల్లాడిలాగా ఆడుతున్నావ్, నేనంటే కక్ష్య కట్టి మరీ ఆడినట్లుగా ఉందంటూ మాట్లాడాడు. అలాగే శాడిస్ట్ లాగా ఆడాడు అంటూ రతిక ముక్తాయింపు ఇచ్చింది.
ఇక ఈ టాస్క్ (Bigg Boss 7 Telugu) చూసిన ఆడియన్స్ వేరేలా రియాక్ట్ అవుతున్నారు. అమర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ముసలోళ్లని, ఆడోళ్లని చేసి టాస్క్ లో గెలవడం కాదు, అర్జున్ – ప్రసాంత్ – గౌతమ్ – యావర్ లు బరిలో ఉన్నప్పుడు ఆడాల్సింది ఈ ఆట అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు బరిలోకి దిగితే పిల్లిలా ఆడతాడు. ప్రియాంక, శివాజీ, భోలే, అశ్వినిలు కాబట్టి చెలరేగి ఆడాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అమర్ ఆటలో గెలిచినా, ఓడినా ట్రోల్ అవుతూనే ఉన్నాడు. అదీ మేటర్.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!