బాలీవుడ్ నటీనటులతో నిండిపోతున్న సాహో

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంయుక్తంగా 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ తారలు ఎక్కువమంది  నటిస్తున్నారు. హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముకేష్, మరికొన్ని కీలక పాత్రలో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను  ఆనంద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్ లోకి మరో బాలీవుడ్ భామ కలిసింది. ‘యారియా’, ‘కుచ్‌ కుచ్‌ లోచా హై’, ‘యే జవానీ హై దివానీ’ చిత్రాల్లో నటించిన ఎవ్లిన్‌ శర్మ సాహోలో కాసేపు కనిపించనుంది.

చిన్న రోల్ అయినప్పటికీ తన విన్యాసాలతో మైమరపించనున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం ఎవ్లిన్‌ పది కిలోలు తగ్గారని సమాచారం. ప్రస్తుతం సాహో లేటెస్ట్ షెడ్యూల్ అబుదాబిలో సాగుతోంది. దాదాపు 45రోజుల పాటు కొనసాగనున్న ఈ భారీ షెడ్యూల్  హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంతో పాటు ఎవ్లిన్‌ శర్మ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus