ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన కొత్త డౌట్..!

సోషల్ మీడియాలో బిగ్ టాపిక్ ప్రభాస్ 20 అప్డేట్. కొన్నాళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ మూవీ నిర్మాతలను తిట్టిపోస్తున్నారు. అయినప్పటికీ వారి నుండి అప్డేట్ కాదు కదా…కనీసం సమాధానం కూడా లేదు. ఐతే రేపు,ఎల్లుండి మరో వారంలో అంటూ ఫేక్ న్యూస్ లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గత వారం ప్రభాస్ 20 నుండి అప్డేట్ రావచ్చని గట్టి ప్రచారం జరిగింది. ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎప్పటిలాగే నిరాశతో ఊరుకున్నారు.

ఇక లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీనితో ప్రభాస్ మూవీ 2021కి షిఫ్ట్ అయ్యింది. ప్రభాస్ గత ఏడేళ్లుగా రెండేళ్లకు ఓ మూవీ విడుదల చేస్తుండగా ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యింది. కాగా మరో నాలుగు నెలలలో ప్రభాస్ పుట్టినరోజు ఉంది. అక్టోబర్ 23 ప్రభాస్ జన్మదినం. ఈనేపథ్యంలో ప్రభాస్ 20 నిర్మాతలు అప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఆపుతారేమోనన్న అనుమానం కలుగుతుంది. ప్రభాస్ పుట్టిన రోజున ఏకంగా ప్రభాస్ 20 టీజర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం కలదు.

మరి ఇదే ప్రభాస్ నిర్మాతల నిర్ణయం అయితే మరో నాలుగు నెలలు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పదు. ఇక ఈ మూవీకి రాధా శ్యామ్ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ దాదాపు 50 శాతం వరకు షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. అలాగే దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా…యూరఫ్ నేపథ్యంలో నడుస్తుందట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus