Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

సినిమాకు టైటిల్‌ పెట్టనప్పుడు ఆ హీరో పేరు చివరో, షార్ట్‌ చివరనో ఓ పేరు పెట్టి వర్కింగ్‌ టైటిల్‌ అని అంటారు. ఆ ఆర్డర్‌లోనే సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. ఈ నెంబర్లు పెట్టకపోయినా అలానే జరుగుతూ వస్తోంది. అయితే ఒకేసారి వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ సినిమాల లైనప్‌ గురించి నమ్మకంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన ముందు మొదలుపెట్టిన సినిమా కంటే తర్వాత స్టార్ట్‌ చేసిన సినిమా ముందు విడుదలవుతోంది.

Fauji

ప్ర‌భాస్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. నాగ్‌ అశ్విన్‌ ‘క‌ల్కి 2’ త్వరలో సెట్స్‌ పైకి వెళ్తుందని సమాచారం. ఈ లెక్కన తొలుత ‘ఫౌజీ’ సినిమా రిలీజ్‌ అవుతుంది అని అనుకుంటారంతా. కానీ సినిమా టీమ్‌ నుండి ఈ విషయంలో ఎలాంటి ఉలుకు పలుకూ లేదు. మరోవైపు తర్వాత స్టార్ట్‌ అయిన ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామంటూ నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు.

నిజానికి సెప్టెంబ‌రు నాటికి ‘ఫౌజీ’ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది అని చెబుతున్నారు. ఆ లెక్కన సులభంగా వచ్చే సంక్రాంతికి వచ్చేయొచ్చు. కానీ ఈ సినిమా కథ ప్రకారం, కాన్వాస్‌ ప్రకారం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి చాలా టైమ్ ప‌డుతుంది అని చెబుతున్నారు. దీంతో జ‌న‌వ‌రిలో విడుద‌ల అయ్యే ఛాన్స్ లేదు. కాబ‌ట్టి ‘ఫౌజీ’ సినిమా కంటే ముందే.. ‘స్పిరిట్’ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘స్పిరిట్‌’ను టైమ్‌ అంటే టైమ్‌కి పూర్తి చేసేయాలి అని సందీప్‌ వంగా ఫిక్స్‌ అయ్యారట.

అందుకే 95 నుంచి 100 కాల్షీట్ల‌లోనే షూటింగ్‌ ముగించేలా ప్లాన్‌ చేస్తున్నారట. అలా అయితే ఈ సినిమానే ముందు తీసుకురావొచ్చు కదా అనే డౌట్‌ రావొచ్చు. రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇయర్‌ ఎండర్‌, సంక్రాంతి కంటే తమకు సమ్మరే బెటర్‌ అని సందీప్‌ వంగా అనుకుంటున్నారట.

2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus