Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

2 రోజుల నుండి ఓ వార్తా తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే… పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ సినిమా సీక్వెల్లో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా ఎంపికైంది అనేది ఆ వార్త సారాంశం. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరేదో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించి ఏడాదిన్నర దాటింది.

Sai Pallavi

మొదటి భాగంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. అయితే రెండవ భాగం నుండి ఆమె తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన ఇండియన్ సినీ పరిశ్రమని షాక్ కి గురిచేసింది. అప్పటి నుండి ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తికర చర్చ నడుస్తూనే ఉంది. అలియాభట్, శ్రద్దా కపూర్ అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి.

ఫైనల్ గా సాయి పల్లవి ఫిక్స్ అయ్యిందని 2 రోజుల నుండి సోషల్ మీడియాలో తెగ వాయిస్తున్నారు కొందరు నెటిజెన్లు. దర్శకుడు నాగ్ అశ్విన్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్లు త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నట్టు అంతా చెప్పుకున్నారు. చెప్పాలంటే.. ఆ వార్త వినడానికి కూడా చాలా బాగుంది.

అలాంటి బరువైన పాత్రని క్యారీ చేయడానికి సాయి పల్లవి మంచి ఆప్షన్ కూడా..! కానీ అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం ప్రాజెక్టుతో బిజీగా గడుపుతోంది. అది పూర్తయ్యేవరకు మరో ప్రాజెక్టుకి సైన్ చేసే ఆలోచనలో ఆమె లేదట. అది మేటర్.

మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus