మహేష్ తో సినిమా… నిర్మాతలకు పెద్ద తలనొప్పంట..!

మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలనీ చాలామంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా నిర్మాతలైతే ఎప్పుడెప్పుడు మహేష్ తో మా ప్రాజెక్ట్ ఓకే చేస్తాడా అని తహ తహలాడుతుంటారు. ఇందుకోసం మహేష్ ఎంత రెమ్యూనరేషన్ చెప్పినా రెడీ అంటుంటారు. ఒకవేళ మహేష్ పలానా నిర్మాతతో సినిమా చేయడానికొప్పుకున్నా… నిర్మాతలకి మాత్రం ఇప్పుడు కొత్తరకం తలనొప్పిచిందంట. ఇది కూడా ‘మహర్షి’ విషయంలోనే ఎక్కువ జరుగుతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

విషయంలోకి వెళితే… అవుడ్డోర్ షూటింగ్ అంటే మ‌హేష్ రావ‌డానికి ఒప్పుకోవట్లేదంట. హైదరాబాద్ లోనే సెట్ వేసి తీయమని డిమాండ్ చేస్తున్నాడ‌ట. ‘మ‌హ‌ర్షి’ చిత్రంలో కొన్ని సీన్ల కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసిన సంగతి తెలిసిందే. నిజానికి వాటిని తూగో జిల్లాలోనో… లేదా కేర‌ళ‌లోనో తీయాల‌ని చిత్ర‌బృందం అనుకున్నప్పటికీ మ‌హేష్ మాత్రం దానికి నో చెప్పాడ‌ట‌. దీనికోసమే .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సెట్ వేశారట. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి ఈ సెట్ వేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఇపుడు మరో స‌న్నివేశం కోసం బీడు వారిన భూమిని చూపించాల్సివ‌చ్చింద‌ట‌. నిజానికి రాయ‌ల‌సీమ‌లోని ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ బీడువారిన భూమి చూపించవచ్చు. కానీ మ‌హేష్ మాత్రం అవుడ్డోర్ షూటింగ్‌కి రాన‌ని చెప్పడంతో… దేనికోసం కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తుంది. సాధారణంగా మహేష్ వంటి స్టార్ హీరో ఇలా పల్లెటూరికి వెళితే అక్కడ జనం ఎగపడతారనడంలో సందేహం లేదు. ఇందుకోసమే మహేష్ ఇలా సెట్లు వేయమని కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే నిర్మాతలకి కొన్ని ఖర్చు మాత్రం తప్పదు. మరి స్టార్ హీరోలతో సినిమా అంటే దర్శకనిర్మాతలు ఇలా రాజీ పడక తప్పదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus