Jack: జాక్ రిలీజ్‌కు మెగా టెన్షన్?

టాలీవుడ్ యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)  జంటగా నటించిన ‘జాక్’ (Jack) మూవీకి విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రావాల్సిన ఈ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇంత హైప్ మధ్య ఇప్పుడు ఒక పాత సినిమా సమస్యగా మారింది.

Jack

అదే గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫారిన్ బ్యాక్‌డ్రాప్, హై బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. అదే సమయంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసిన గోదావరి ఏరియాల బయ్యర్లు పూర్తిగా నష్టపోయామని ఆరోపించారు. అప్పట్లో ఇచ్చిన అడ్వాన్స్ రికవరీపై నిర్మాతల నుంచి స్పందన లేదని, ఇప్పుడు అదే ఇష్యూ ‘జాక్’ విడుదలకు అడ్డుగాచేస్తోంది.

గతంలోని బాధ మరవక ముందే, ఇప్పుడు ‘జాక్’ మూవీ విడుదలకు అదే బయ్యర్లు స్టే వేయాలని ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించడం నిర్మాతలకు పెద్ద చిక్కే. నిర్మాతలైన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) , బాపినీడు ఇప్పటికే సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కానీ గత సినిమా డీల్ క్లియర్ కాకపోవడం వల్ల ‘జాక్’ బిజినెస్ పూర్తిగా పూర్తి కాలేదనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్‌లో సీరియస్‌గా చర్చకు వస్తోంది. గోదావరి డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదు నిజమైతే, విడుదలను నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చు.

ఇది నిర్మాతల పరంగా మాత్రమే కాకుండా, సినిమా టెక్నికల్ టీమ్‌, హీరో సిద్ధు తదితరులకు కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. ఇంకా మిగతా బయ్యర్లు కూడా ఇదే దారిలోకి వస్తే, అది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ‘జాక్’ నిర్మాతలు తక్షణమే ముందడుగు వేసి సుముఖంగా సమస్యను పరిష్కరించాలి. గతం తప్పులు భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలంటే ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ తప్పనిసరి. లేదంటే, బజ్ ఉన్నప్పటికీ సినిమా విడుదలపై గందరగోళం కొనసాగుతుంది. మరి నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus