మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంగా వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’. అనుకున్నట్టు గానే మంచి టాక్ ను సంపాదించుకుంది. కానీ కలెక్షన్ల విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది అన్నది వందకు వంద శాతం నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ‘బాహుబలి’ సిరీస్ తరువాత ఆ ఫీట్ ‘సైరా’ మాత్రమే సాధ్యమయ్యింది. అయితే ‘పాన్ ఇండియా’ రేంజ్లో అస్సలు వర్కౌట్ కాలేదు. ఎంతకాదనుకున్నా ఫుల్ రన్లో 40 కోట్ల పైనే నష్టాలు వచ్చేలా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అది కూడా ఇప్పుడు కొత్త సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలు లేకపోతే ఇప్పుడున్న పెర్ఫార్మన్స్ ను బేస్ చేసి చెబుతున్న ఫిగర్స్ అట. అంటే నష్టం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు.
ఇక వైజాగ్, నైజాం, సీడెడ్ వంటి ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన ఏరియాల్లో కోటిన్నరకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ‘సైరా’ నష్టాలను ‘చిరు 152’ తో తీర్చాలని చిరు,చరణ్ లు భావిస్తున్నారట. అందుకే వీలైనంత తొందరగా సినిమాని కంప్లీట్ చెయ్యాలని దర్శకుడు కొరటాల శివ ను కూడా కోరారట. కొరటాల ఎలాగు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఎంతకాదనుకున్నా 8 నెలల్లో సినిమాని పూర్తి చేసేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?