ఆచార్య వల్ల తారక్ సినిమాకు అలాంటి కష్టాలు వచ్చాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. తారక్ కొరటాల శివ కాంబో మూవీకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని బోగట్టా. జాన్వీ కపూర్ తారక్ కు జోడీగా నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తుండటంతో ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మాతలు అనే సంగతి తెలిసిందే.

మిక్కిలినేని సుధాకర్ కొరటాల శివకు సన్నిహితుడు కాగా ఆచార్య సినిమా పలు ఏరియాల హక్కులను కొనుగోలు చేయడం వల్ల ఆయనకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఆచార్య ఫ్లాప్ వల్ల ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా రిజల్ట్ వల్ల కొరటాల శివను సినిమాకు ఫైనాన్స్ చేసేవాళ్లలో కొంతమంది నమ్మడం లేదు. ఓవర్సీస్ లో ఉన్నవాళ్ల నుంచి ఫైనాన్స్ తీసుకుని ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టాలని నిర్మాత భావిస్తున్నారు.

త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మాస్ ప్రేక్షకులను, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ మాత్రం ఆచార్య విషయంలో జరిగిన తప్పు ఈ సినిమా విషయంలో జరగదని భావిస్తున్నారు.దర్శకునిగా కొరటాల శివ రేంజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ సైతం కొరటాల శివపై పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగి ఉన్నారు. కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. ప్రముఖ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం ఎంపిక చేయగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus