చైనా దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో కేంద్రం ముందస్తు చర్యల్లో భాగంగా థియేటర్లతో పాటు వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. కరోనా, లాక్ డౌన్ రూల్స్ వల్ల థియేటర్లు మూతబడటంతో చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేశారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు సైతం వీ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. అయితే గతేడాది చివరి వారం నుంచి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్ సినిమాలు హిట్ కావడంతో థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని సినిమా రంగానికి చెందిన వాళ్లు భావించారు. ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు కూడా హిట్ కావడంతో సాధారణ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి ఛూపడం లేదు. పెద్ద సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు, యంగ్ హీరోల సినిమాల కోసం థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి లేదు.
ఫలితంగా టాలీవుడ్ కు మళ్లీ ఓటీటీలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రేక్షకులు హిట్ టాక్ వస్తే మాత్రమే ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. గతేడాది రిలీజైన వీ, నిశ్శబ్దం సినిమాలు అమెజాన్ ప్రైమ్ కు భారీగా నష్టాలను మిగల్చడంతో ఓటీటీలు సైతం సినిమాలను కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఓటీటీలు చిన్న సినిమాలను కొనే పరిస్థితి లేకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!