Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నయా రికార్డ్.. అభిమానులు గర్వపడేలా?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ మరో 5 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే మహేష్ బాబు ఖాతాలో నయా రికార్డులు చేరుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

దాదాపుగా ఏడాదిన్నర తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ కానుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి 5408కు పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారని సమాచారం అందుతోంది. గతంలో విడుదల టాలీవుడ్ సినిమాల ప్రీమియర్ షోల కంటే గుంటూరు కారం సినిమాకు ఎక్కువ సంఖ్యలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

ఆర్.ఆర్.ఆర్, సలార్ తో పోల్చి చూస్తే గుంటూరు కారం షోలు ఎక్కువ సంఖ్యలో ప్రదర్శితం కానుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. లాంగ్ రన్ లో ఓవర్సీస్ లో గుంటూరు కారం 5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కానున్నా ఈ స్థాయిలో సంచలనాలు సృష్టించడం మహేష్ కే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల, మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఆ ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరిగింది. గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ మాత్రం ఇతర భాషల్లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చెసీంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus