ఉత్తరాదిన ఫేమస్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో సౌత్ లో మొదలు పెడుతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ‘ఈ షో ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు’ అంటూ ఎంతో మంది నెగిటివ్ ఒపీనియన్స్ ను వ్యక్తం చేశారు. అయితే వారందరి అభిప్రాయాలను తలక్రిందులు చేస్తూ.. ఈ షో సౌత్ లో అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుందనే చెప్పాలి.
2017లో ప్రారంభమైన ఈ షోని మొదట ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యగా.. రెండో సీజన్ ను నాని, మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యనున్నారనే టాక్ బలంగా నడుస్తుంది. ఈ పాటికే మొదలు కావాల్సిన ‘బిగ్ బాస్ సీజన్4’ కరోనా కారణంగా ఆలస్యం అవుతూవస్తుంది.అయితే ఈ సీజన్4 కు.. కంటెస్టెంట్ ల విషయంలో కొన్ని కఠిన నిబంధనలు తీసుకోవాలని ‘బిగ్ బాస్’ టీం డిసైడ్ అయ్యారాట.
ఈ సీజన్ 4 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కు ముందుగా కరోనా టెస్టులు చేయించి.. షో మొదలయ్యే రెండు వరాలు ముందు నుండీ నిర్వాహకుల పర్యవేక్షణలో ఉంచాలని వారు భావిస్తున్నరాట. షో మొదలయ్యే ముందురోజు కూడా మళ్ళీ వారికి కరోనా టెస్టులు చేయించి.. నెగిటివ్ వస్తే వారిని హౌస్ లోకి ఎంట్రీ చేయిస్తారాట. అంతేకాదు యూనిట్ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయించే పనులు అప్పగిస్తారని సమాచారం.