Balakrishna: బాలయ్యకు “అ” అక్షరం అచ్చిరాలేదా..?

ఇతర రంగాలతో పోలిస్తే సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణతో పాటు పలువురు స్టార్ హీరోలు సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ ను బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్ టెన్షన్ పెడుతోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు అఖండ అనే టైటిల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

అయితే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలలో అ అక్షరంతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరువాత సరైన హిట్ లేని బాలకృష్ణ అఖండ సినిమాతో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు. బాలకృష్ణ గత సినిమా రూలర్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ విజయాలు అందించిన బోయపాటి శ్రీను అఖండ మూవీతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని బాలయ్య ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన అఖండ ఫస్ట్ లుక్ లు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే బాలయ్య నటించిన అన్నాదమ్ముల అనుబంధం, అనురాగ దేవత, అక్బర్ సలీం అనార్కలి, అధినాయకుడు, అల్లరి పిడుగు, అశ్వ మేధం, అశోక చక్రవర్తి అల్లరి కృష్ణయ్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోలేపోయాయి. బాలకృష్ణ నటించిన అనసూయమ్మ గారి అల్లుడు సినిమా మాత్రం హిట్ కాగా అపూర్వ సహోదరులు సినిమా యావరేజ్ గా నిలిచింది.

అ అక్షరంతో బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ కావడంతో అఖండ టైటిల్ ను మార్చితే బాగుంటుందని బాలకృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి శ్రీను టైటిల్ లో మార్పులు చేస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus