లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల ఓటిటికి భారీ డిమాండ్ పెరిగింది. అందులోనూ ఇప్పుడు అంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు కాబట్టి.. ఇదే మంచి టైం అని కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చెయ్యాలి అని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కీర్తి సురేష్.. ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేసారు. ఈ చిత్రాన్ని జూన్ 19న అమెజాన్ లో విడుదల చేసారు. లో బడ్జెట్ లో తీశారు కాబట్టి.. నిర్మాత సేఫ్.ఎక్కువ మంది చూసారు కాబట్టి ఈ సినిమా రైట్స్ కొన్న ‘అమెజాన్’ వారు కూడా సేఫ్.
అయితే ‘పెంగ్విన్’ లో పెద్దగా మ్యాటర్ లేదు. ‘ ‘రాక్షసుడు'(రట్సాసన్) రేంజ్ టేకింగ్.. ‘హిట్’ సినిమా వంటి ట్విస్ట్’ పెట్టి మమ అనిపించేసారు అనే విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ‘పెంగ్విన్’ ను చూసాక.. కేవలం కంటెంట్ లేని సినిమాలనే ఓటిటిలో విడుదల చేస్తున్నారు అనే ముద్ర ప్రేక్షకుల గుండెల్లో పడిపోయింది. ‘వి’ ‘రెడ్’ ‘ఉప్పెన’ వంటి సినిమాలకు ఓటిటి నుండీ ఎంత మంచి రేటు పలికినా.. వాళ్ళు మాత్రం థియేట్రికల్ కే బలంగా ఫిక్స్ అయ్యారు. ఆ సినిమాల పై వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదనే చెప్పాలి.
‘పెంగ్విన్’ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రభావం కీర్తి నెక్స్ట్ సినిమాల పై పడుతుందేమో అని ఆమె చాలా భయపడుతుందట. కీర్తి నటించిన ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటి గురించి కూడా ఇప్పుడు ఆమెలో కలవరం మొదలైనట్టు తెలుస్తుంది. అందులోనూ ఓటిటి వల్ల తన కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందా అనే భయం కూడా ఆమెలో మొదలైనట్టు సమాచారం.