Balakrishna: ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..!

నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తూ.. ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ‘అఖండ’ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా, పాండమిక్ తర్వాత భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి పరిశ్రమకు కొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే బాలయ్య సినిమాలను మాత్రం ఓ ప్లాన్ ప్రకారం పకడ్బందీగా సెటప్ చేస్తున్నారు.

‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలయ్య కెరీర్ లో 107వ సినిమా తెరకెక్కుతుంది.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఫస్ట్ టైం శృతి హాసన్ బాలయ్యతో జతకడుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ బ్యూటీ హనీ రోజ్, మలయాళ నటుడు లాల్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి ‘వీర సింహా రెడ్డి’, ‘రెడ్డి గారు’ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఆల్ మోస్ట్ ‘రెడ్డి గారు’ టైటిల్ ఫిక్స్ అని వార్తలు వచ్చాయి.. ఫస్ట్ టైం ఓ సినిమా కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఓ సినిమా టైటిల్ రిలీజ్ చెయ్యడం అంటూ అక్టోబర్ 21 రాత్రి 8:15 గంటలకు బాలయ్య సినిమా పేరు ప్రకటించనున్నామని మేకర్స్ తెలిపారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఎన్నో చర్చలు జరిపిన తర్వాత మూవీ టీం అంతా ‘వీర సింహా రెడ్డి’ టైటిల్ కే ఫిక్స్ అయ్యారట.

ఈ టైటిల్ రిలీజ్ కార్యక్రమానికి కూడా బాలయ్యే ముహూర్తం ఫిక్స్ చేశాడట. సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చెయ్యనున్నారంటూ సోషల్ మీడియాలో #NBK107 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ సినిమా చెయ్యబోతున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus