టార్గెట్ దిల్ రాజు!!!

టాలీవుడ్ లో సినిమా డిస్ట్రబ్యూటర్ గా తన కరియర్ మొదలు పెట్టి, ఆ తరువాత చిన్న సినిమాల నిర్మాతగా మారి, అటుపై బడా హీరోల నిర్మాతగా వ్యవహరిస్తూనే, అదే క్రమంలో ముల్టీ స్టారర్ సినిమాలను సైతం నిర్మించే అంతగా ఎదిగాడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఆనలుగులో ఒకడు దిల్ రాజు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజుపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి…దాదాపుగా ఆయన్నే టార్గెట్ చేస్తూ కొందరు ఆయనపై విమర్శలు చేస్తున్నారు…విషయం ఏమిటంటే….పెద్ద సినిమాలు, భారీ సినిమాలు డిజాస్టర్స్ గా మారుతున్న తరుణంలో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది.

అయితే చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యీ, భారీ హిట్స్ కొడుతూ ఉండడంతో, చిన్న సినిమా నిర్మాతలకి మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అదే క్రమంలో చిన్న సినిమాలకి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో చిన్న సినిమాల వద్ద నుండి థియోటర్స్ యజమానులు భారీగా మనీని డిమాండ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే అందులో దిల్ రాజుపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి….ఎక్కువ థియోటర్స్ కావాలంటే లక్షల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అని. అలా ఇచ్చుకోలేని చిన్న నిర్మాతలకి, వారి సినిమాని పెద్ద నిర్మాతలు రిలీజ్ చేసుకోనివ్వటం లేదని అంటున్నారు.

దీని కారణంగా చిన్న నిర్మాతలు అందరూ నష్టపోవాల్సి వస్తుంది అని  ఫిల్మ్ నగర్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ చాంబర్స్ వద్ద చిన్న నిర్మాతలంతా కలిసి ధర్నాకు దిగారు. ఇక ఆ దర్నాలో అందరి చూపు దిల్ రాజు, ఆయన వైఖరిపైనే….అందరికన్నా దిల్ రాజు వ్యవహారం చాలా ఇబ్బందిగా ఉంది అని, దిల్ రాజు స్వయంగా చిన్న నిర్మాతల సినిమాలకి థియోటర్స్ ని ఇవ్వటం లేదు అని వారి చెబుతున్నారు. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఏమంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus