కాస్త ఫేమ్‌లో ఉన్న హీరోయిన్ల పై ప్రేమ వార్తలు రావడం సహజమే. ఓ ప్రముఖ హీరోతో డేటింగ్ లో ఉందన.. త్వరలో అతన్నే పెళ్లి చేసుకోబోతుందని కూడా ప్రచారం జరగడం మనం చూస్తూనే వస్తున్నాం. తీరా వీటి గురించి ఆ హీరోయిన్ ను ఆరా తీస్తే.. అలాంటిదేమి లేదని.. ఆ హీరో తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని మొహమాటానికి ఓ మాట చెబుతుంటారు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ప్రస్తుతం నిధి అగర్వాల్ పై కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి.
గతంలో ఈమె క్రికెటర్ అయిన కె.ఎల్.రాహుల్‌తో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మేము ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ అని చెప్పి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది నిధి. ఇదిలా ఉండగా… ఇప్పుడు కూడా నిధి అగర్వాల్ ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ హీరోతోనే నిధి పెళ్లి ఫిక్సయిపోయిందని కూడా ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ వార్తల పై నిధి క్లారిటీ ఇచ్చింది. ‘నేనెవరితోనూ డేటింగ్ చెయ్యడం లేదు. నా పై వస్తోన్న పెళ్లి వార్తలను క్కూడా నమ్మొద్దు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా సినిమాల పైనే ఉంది.