‘చిన్నప్పటి నుండీ మనం ఏదో అవ్వాలి అనుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల .. మరో వైపుకు వెళ్ళాల్సి రావచ్చు. మనం అనుకున్నట్టుగా కాకుండా వేరే రంగంలో స్థిరపడే అవకాశం కూడా ఉండొచ్చు’ అంటూ ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ నిథి అగర్వాల్ మాత్రం చిన్నప్పటి నుండీ సినిమాల్లో నటించాలి అని గోల్ పెట్టుకుందట. ఇప్పుడు దానిని సాధించాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.
నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్య సాచి’ చిత్రంతో పరిచయమైన నిథి అగర్వాల్ .. ఆ తరువాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా నటించింది. అయితే గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్.. సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిథి అగర్వాల్.. తన గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. నిథి అగర్వాల్ మాట్లాడుతూ.. “నా చిన్నప్పుడు మొదటిసారి సినిమా చూసినప్పుడే… నాకెంతో ఆనందం కలిగింది.
అప్పుడే నటి కావాలని ఫిక్స్ అయిపోయాను. అయితే ఆ డ్రీం ను ఎలా ఫుల్ ఫిల్ చేసుకోవాలో నాకు తెలీదు. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. దాంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టాను. మోడలింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించే అవకాశం లభించింది. కొంతకాలానికి సౌత్ లో ఆఫర్స్ లభించాయి” అంటూ చెప్పుకొచ్చింది.