Nidhhi Agerwal: నిధి అగర్వాల్ సేవాగుణం.. ఏం కావాలో చెప్పండి!
- May 27, 2021 / 12:30 PM ISTByFilmy Focus
కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఆర్దిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో ఉన్నవాళ్లు ఆదుకుంటే లేని వాడు ఆకలి బాధ నుంచి తప్పించుకోవచ్చని చాలామంది సహాయలు చేస్తున్నారు. ఇక మరికొందరు సినిమా తారలు కోవిడ్ రోగుల కోసం వైద్య సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సహాయం చేసేందుకు సిద్ధమయ్యింది. సహాయం చేసేందుకు నిధి ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళ్లి అడిగిన వారికి తనకు తోచినంత సహాయం చేస్తానని అంటోంది.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే కోవిడ్ బాధితులు ఈ కష్ట సమయంలో అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారని అర్థమవుతోంది. నా శక్తిమేరకు తగినంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మెడిసిన్స్, నిత్యావసర సరుకులు వంటి వాటిని అందించడానికి రెడీగా ఉన్నట్లు చెబుతూ ఆన్లైన్ వెబ్ పోర్టల్ లో వివరాలు అందించాలని కోరింది. వెబ్‌సైట్ https://distributelove.orgలో వివరాలు నమోదు చేసుకోవాలని వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

తప్పకుండా వీలైనంత ఎక్కువమందికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిధి వివరణ ఇచ్చారు. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మరో రెండు సినిమాలు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!













