Niharika: వాట్ ది ఫిష్ సినిమా నుంచి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు ఈమె ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు నిహారిక సినిమాలకు కమిట్ అయినట్లు ఎక్కడా కూడా ప్రకటించలేదు కానీ తాజాగా ఈమె సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నేడు నిహారిక పుట్టినరోజు కావడంతో ఈమె సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నటువంటి వాట్ ది ఫిష్ అనే సినిమాలో (Niharika) నిహారిక కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈమె హీరోయిన్గా నటిస్తున్నారా లేక ఏదైనా పాత్రలో నటిస్తున్నారన్న విషయం తెలియదు కానీ తాజాగా ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో నిహారిక మెరిసేటి షార్ట్ డ్రెస్ లో అదరగొడుతుంది. అయితే హీరోయిన్ పాత్ర లేదా ఇంకేదైనా కీలక పాత్ర చేస్తుందా అనేది క్లారిటీ రావాలి.

గతంలో కూడా ఈమె మూడు సినిమాలలో హీరోయిన్గా నటించారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు అయితే ప్రస్తుతం నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించిన నిహారిక సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.

ఇక మనోజ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఈయన తన వ్యక్తిగత కారణాలవల్ల ఎన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus