నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మర్చి 29 న(నిన్న) విడుదలయ్యి ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. దీంతో నిహారిక కి హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యిన్నట్టే అయ్యింది. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ నిహారిక నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది.. ఈ చిత్రం ఎగ్జిక్యూషన్ వలనే ప్లాప్ అయ్యింది అనే టాకొచ్చింది. సో ఈ చిత్రంతో కూడా నిహారిక ఓకే అనిపించింది. కానీ ‘సూర్యకాంతం’ సినిమా చూసిన ప్రేక్షకులు ఇక సహనం కోల్పోయినట్టున్నారు. నిహారిక పై ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు.
‘సూర్యకాంతం’ చిత్రంలో నిహారిక యాక్టింగ్ చూసినోళ్ళు ‘ఇదేం టార్చర్ రా బాబు… యాక్టింగ్ చేయమంటే ఇలా ఓవర్ యాక్టింగ్ చేసి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ రకరకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కథ, కథనాలు వెబ్ సిరీస్ లు ఎక్కువ… సినిమాకి తక్కువ అన్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ కథని వెబ్ సిరీస్‌గా తీసుకున్నా బాగుండేదేమో అనేలా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నిహారిక కూడా వెబ్ సిరీస్ మూడ్ నుండీ బయటకు రావడం లేదు’ అంటున్నారు. ‘కొంచెం సరైన కథల్ని ఎంచుకుని… నటనకి ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంచుకుంటే బెటర్’ అంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఏదేమైనా నిహారిక హ్యాట్రిక్ కంప్లీట్ చేసేసింది.