మెగా కాంపౌండ్ నుంచి మెగా వారసులుగా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . రామ్ చరణ్, వరుణ్, వైష్ణవ్, సాయి ధరమ్, అల్లు అర్జున్,కళ్యాణ్ దేవ్ వంటి హీరోలందరూ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ వారి కంటే గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే త్వరలోనే మరొక అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య కూడా ఆమె బాటలోనే పయనిస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
చైతన్య కూడా హీరో పర్సనాలిటీ ఉండడంతో ఈయన ఇండస్ట్రీలోకి తప్పనిసరిగా వస్తారని అందరూ భావించారు. అయితే ఈ విషయంపై చైతన్య సన్నిహితులు స్పందిస్తూ తాను ఇండస్ట్రీలోకి రానని ప్రస్తుతం తాను వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉన్నారనీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా చైతన్య సినిమా ఎంట్రీ గురించి తన సన్నిహితులు క్లారిటీ ఇచ్చినప్పటికీ నిహారిక భర్త సినీ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈయన గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి
త్వరలోనే చైతన్య తన డెబ్యూ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా తన సినీ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఎట్టకేలకు ఈ విషయంపై చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిహారిక భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య ఈ విషయంపై స్పందిస్తూ తనకు సినిమాలలో నటించడం ఇంట్రెస్ట్ లేదని, ప్రస్తుతం తాను బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ తన లైఫ్ లో ఎంతో సంతృప్తిగా ఉన్నానని
అందుకే తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు అంటూ తన గురించి వస్తున్న వార్తల పై చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చైతన్య సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నిహారిక మాత్రం పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.