మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) .. ఎంతో ఇష్టంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదట టీవీ షోలకి హోస్ట్ గా, తర్వాత ఢీ వంటి షోలకు మెంటర్ గా.. ఆమె వ్యవహరించింది. మరోపక్క వరుసగా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. లీడ్ రోల్ లేదంటే నిర్మాతగా ‘ముద్దపప్పు ఆవకాయ్ ‘ వంటి వెబ్ సిరీస్…లలో నటించింది. తర్వాత నాగ శౌర్య కి (Naga Shaurya) జోడీగా ‘ఒక మనసు’ (Oka Manasu) సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది కానీ..
కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నిహారిక చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ (Happy Wedding) ‘సూర్యకాంతం’ (Suryakantham) వంటి సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఆమె పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లో ఓ పాత్ర చేసినా.. ఆమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ పడటం.. నిహారికకి పెళ్లవడం.. ఆ తర్వాత ఆమె ఫేస్ చేసిన విషయాలు అందరికీ తెలిసిందే.
అయితే కొంత గ్యాప్ తర్వాత ఆమె వరుసగా షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేస్తూ వస్తోంది. కానీ అవి ఆమె ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే ‘కమిటీ కుర్రాళ్ళు’ (Committee Kurrollu) అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. నిన్న అంటే ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి టాక్ రాబట్టుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.1.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు.
ఇలాంటి టైంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ను సాధించడం అంటే మాటలు కాదు. వీకెండ్ వరకు ఈ సినిమా ఇదే రేంజ్లో కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి .. సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసినట్టే అని చెప్పాలి. సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఓటీటీకి కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. సో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ళకి నిహారిక ఖాతాలో ఓ హిట్టు పడింది అని చెప్పాలి.