Niharika: తనతో కలిసి సినిమా చూస్తూ చిల్ అవుతున్న నిహారిక!

  • April 25, 2023 / 08:39 PM IST

మెగా డాటర్ నిహారిక గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు రావడంతో నిహారికకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇలా నిహారిక వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ నిహారిక మాత్రం ఈ విషయాలను ఖండించే ప్రయత్నం అసలు చేయడం లేదు. ఇక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటి నుంచి ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతూ ఫోటోషూట్లు చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది.

అలాగే తన నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాల నిర్మాణ పనులలో కూడా (Niharika) ఈమె బిజీగా మారిపోయారు. కొద్దిరోజుల క్రితం ఈమె హైదరాబాదులో తన ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించి ఆఫీసు కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా ఇంఫ్లూయెన్సర్ నిహారికతో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిన్నటి రాత్రి ఈ ఇద్దరూ సినిమా చూస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మూవీ టైం అంటూ ల్యాప్ ట్యాప్‌లో సినిమాను చూస్తూ, స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలుస్తోంది. ఇంఫ్లూయెన్సర్ నిహారిక సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలువురు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం అలాగే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా భాగమవుతూ సందడి చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus