నిహారిక.. కొత్త యాంగిల్?

పాపం నిహారిక.. హీరోయిన్ అయితే అయ్యింది కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్టు దక్కక పోగా.. కనీసం ఆఫర్లు కూడా రావడం లేదు ఈమెకి. ‘నేను గ్లామర్ షో చేయడానికి.. అలాగే రొమాంటిక్ సీన్లలో నటించడానికి పెర్మిషన్లు లేవు’ అంటూ ఆమె ఓ సందర్భంలో చెప్పకనే చెప్పింది. అంటే ఆమె మెగా ఫ్యామిలీ నుండీ వచ్చింది కాబట్టి ఆమె గ్లామర్ షో చేయకూడదని మొహమాట పడుతూ చెప్పిందని తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే అర్థంచేసుకోవచ్చు.

విషయం ఏమిటంటే తాజాగా నిహారిక తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో లో తడిగా ఉన్న పొడవాటి వైట్ షర్టు వేసుకుని నవ్వుతూ వస్తుంది. ఫాంట్ వేసుకోలేదు కానీ ఆరెంజ్ షార్ట్ వేసుకుంది. “బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు” అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. నిహారిక ఈ ఫోటోలో చాలా హాట్ ఉంది. దీనిని బట్టి చూస్తే నిహారిక గ్లామర్ షో చేయడానికి సైతం రెడీ అని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ ఫోటోకి లైకులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో… నిహారిక పై విరుచుకుపడ్డ వారు కూడా ఉన్నారు. ఏదైతేనేం ఈ పిక్ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus