Niharika: నిహారిక చైతన్య కాంబినేషన్లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా?

మెగా డాటర్ నిహారిక యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించారు. ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక అనంతరం సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో పెద్దగా ఈమె సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ఇలా సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తిరిగి నిహారిక సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా నిహారికకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె యాంకర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమంది దర్శక నిర్మాతలు ఈమెను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని భావించారట ఈ క్రమంలోనే కొంతమంది దర్శకులు వెళ్లి నిహారికను హీరోయిన్గా పరిచయం చేయాలని కోరడంతో అందుకు నాగబాబు ఒప్పుకోలేదట. అప్పటివరకు మెగా కుటుంబంలో ఎవరు కూడా హీరోయిన్లుగా రాలేదు అందుకే తన కూతురిని కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పంపించే అవకాశం లేదని చెప్పారట.

నిహారికకు (Niharika) సినిమాలు అంటే ఆసక్తి ఉండడంతో తన కోరిక మేరకు నాగబాబు కూడా సినిమాలకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఈమెను ఇండస్ట్రీలోకి పంపించడానికి నాగబాబు ఒప్పుకొని సమయంలో ఒక మంచి సినిమా అవకాశం వచ్చినప్పటికీ నాగబాబు కారణంగా ఆ సినిమా మిస్ చేసుకున్నారని లేకపోతే ఇండస్ట్రీలో నిహారిక కూడా సూపర్ సక్సెస్ అందుకునేవారని తెలుస్తుంది. మరి నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఏది అనే విషయానికి వస్తే…

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన 100% లవ్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే.ఈ సినిమా కోసం నాగచైతన్యను ఎంపిక చేసిన అనంతరం హీరోయిన్ గా నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు భావించారట కానీ నాగబాబుకు తన కూతురిని సినిమాలలోకి పంపించాలని ఆసక్తి ఏమాత్రం లేదనే విషయం తెలియడంతో తిరిగి తమన్నకు అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఈ సూపర్ హిట్ సినిమా మిస్ అయిందనే వార్త వైరల్ అవుతుంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus