పెదనాన్న సినిమాలో పెద్ద పాత్రలో నీహారిక..!

దాదాపు డజను హీరోలున్న మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక కథానాయిక నిహారిక. మొదట హోస్ట్ గా పరిచయమై, అనంతరం ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ తో అందరికీ చేరువైన నిహారిక తెలుగు కథానాయికగా నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడిగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం కొందరు విమర్శకుల ప్రశంసలు అందుకోగలిగిందే కానీ కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయింది. అయితే నటిగా మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత విజయ్ సేతుపతితో కలిసి ఒక తమిళ సినిమా చేసింది. ఆదేమో డిజాస్టర్ అయ్యింది. దాంతో సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయాన్ని గ్రహించిన నిహారిక “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు.

అయితే.. తాజా సమాచారం మేరకు నిహారిక తన పెదనాన్న చిరంజీవితో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకొందని తెలుస్తోంది. “సైరా నరసింహా రెడ్డి” చిత్రంలో నిహారిక కీలకపాత్ర పోషించనుందట. ఈమేరకు రంగం సిద్ధమైందని, చిరంజీవి కూడా తనకు కూతురులాంటి నిహారికతో కలిసి నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడని, త్వరలోనే నిహారిక “సైరా నరసింహా రెడ్డి” సెట్స్ కు వెళుతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus