Niharika: వైష్ణవ్ కాంటాక్ట్ నెంబర్ ని.. మెగా డాటర్ ఏ నేమ్ తో సేవ్ చేసుకుందో చూడండి..!

గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ వారి ఇంటికోడలు అయ్యింది మెగా డాటర్‌ నిహారిక. పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. తన కొత్త ఫొటోలను అలాగే సినిమా కబుర్లను అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరోపక్క తన భర్త చైతన్యతో టూర్లు కూడా వేస్తుంది. ఇటీవల తన భర్తతో కలిసి పాండిచ్చేరి అందాలను అస్వాధించింది ఈ అమ్మడు.

పాండిచ్చేరిలో నిహారిక సందడి చేసిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా కాసేపు నెటిజెన్లతో ముచ్చటించింది నిహారిక. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నిహారిక సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌..మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఫోన్ నెంబర్ ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లో ఏమ‌ని సేవ్ చేసుకున్నారు? అని నిహారికను అడిగాడు. దీనికి సమాధానంగా నిహారిక ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది.

అందులో వైష్ణ‌వ్ తేజ్ పేరుని ‘హీరోబాబు’ అని సేవ్ చేసుకున్నట్టు స్పష్టంచేసింది. ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందు నుండే .. వైష్ణవ్‌ తేజ్ పేరుని ఇలా సేవ్‌ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది నిహారిక. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని క్రిష్ డైరెక్షన్లో చేసిన సంగతి తెలిసిందే. అయితే దాని విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus