నిహరికా….కాస్త తగ్గమ్మా!!!

  • March 11, 2016 / 09:57 AM IST

మెగా హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టనున్న కొనిదల నిహారికాకు ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతుంది. ‘ముద్దపప్పు-ఆవకాయ’ అన్న వెబ్ సీరీస్ చేస్తున్న ఈ భామ ఇంకా తొలి సినిమా విడుదల కాకుండానే చాలా పాప్యులర్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘ఒక మనసు’ విడుదల కాకుండానే అప్పుడే ఆమెకు ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు.

ఇక అదే క్రమంలో అభిమానులతో వెబ్ మీడియాలో లైవ్ ఛాట్ లో కాసేపు ముచ్చటించింది ఈ భామ. అభిమానులు అడిగే ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెబుతూ తనదైన శైలిలో దూసుకుపోయింది..ఇంతకీ వారు ఏమడిగారు….ఆమె ఏం చెప్పింది అంటే…

ఒక అభిమాని ఆమెతో ఛాట్ చేస్తూ లైవ్ లో ఫ్లయింగ్ కిస్ అడిగాడు. ఈప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా నిహారిక ‘ప్లయింగ్ కిస్ ఎందుకండి ఆ గాలికి మీరు ఎగిరిపోతారు అందుకే నేను ఇవ్వను’ అంటూ స్పాంటేనియస్ సమాధానం చెప్పింది. మరో పక్క ఒక గ్లాసులో ఎదోతాగుతున్న నిహారికను చూసి వోడ్కా తాగుతున్నావా ? అంటూ ప్రశ్నించాడు మరో వీరాభిమాని . దీనికి ఏమాత్రం తొణకకుండా నిహారిక ‘వోడ్కా లాంటి చెత్తా చెదారం తాగను, ఎప్పుడు మంచినీళ్ళు తాగుతాను అదే నాబ్యుటీ సీక్రెట్ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చింది. ఇలా అభిమానులను ఆటపట్టిస్తూ, వాళ్ళకు కొంటె సమాధానాలను చెబుతున్న ఈ భామను చూసి సినీ సర్కిల్స్ వాళ్ళు తొలి సినిమాకే ఇలా ఉంటే….మున్ముందు పరిస్థితి ఏంటో అని, నిహారికా కాస్త తగ్గు మరీ అని డైరెక్ట్ గానే మాట్లాడుకుంటున్నారంట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus