Nikhil: రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్.. ఏం చేశారంటే..?

  • April 23, 2021 / 03:09 PM IST

హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం సినిమా హిట్ కావడంతో 18 పేజెస్ మూవీతో మరో విజయాన్ని సాధించాలని నిఖిల్ భావిస్తున్నారు. నిఖిల్ కు జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అయితే హీరో నిఖిల్ తాజాగా ఒక మంచి పని చేసి వార్తల్లో నిలిచారు. గుంటూరు జిల్లాకు చెందిన సురేంద్ర అనే వ్యక్తి తండ్రి నాగరాజేశ్వర రావు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.

తండ్రికి కరోనా చికిత్స కోసం రెమిడిసివిర్ డోసులు అవసరం కాగా సురేంద్ర తనకు సహాయం చేయాలని నిఖిల్ ను కోరారు. నిఖిల్ పెద్ద మనస్సుతో ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సిరివూరి రాజేశ్‌ వర్మ అనే వ్యక్తి రెమిడిసివిర్‌ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తారంటూ సురేంద్ర ట్వీట్ కు బదులిచ్చారు. సురేంద్ర నాన్నగారు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నానని ఆ ట్వీట్ లో నిఖిల్ పేర్కొన్నారు. నిఖిల్ చేసిన సాయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కష్టాల్లో ఉన్న కరోనా రోగికి నిఖిల్ సాయం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిఖిల్ హీరోనే అని తను చేసిన సహాయంతో ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో 18 పేజెస్ సినిమా రిలీజ్ కానుంది. 18 పేజెస్ సినిమాతో పాటు చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ నటిస్తున్నారు. ఏడేళ్ల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus