Nikhil, Pawan Kalyan: ‘జల్సా’ కోసం తన సినిమా ఆపేస్తున్నాడా?

పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ‘జల్సా’ సినిమా ప్రత్యేక షోలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్‌ ప్రమోషన్స్‌ కూడా మొదలుపెట్టింది. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ సినిమా కోసం ఓ కుర్ర హీరో తన సినిమా షోలను ఆపేస్తున్నారట. అందులోనూ మంచి వసూళ్లతో తన సినిమా వెళ్తున్నా ఆపేయాలని నిర్ణయించారట. టాలీవుడ్‌లో రీసెంట్‌ హిట్‌ అంటే ‘కార్తికేయ 2’. నిఖిల్‌ – అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో చందు మొండేటి తెరకెక్కించిన సినిమా ఇది.

ఈ సినిమా ప్రస్తుతం నగరంలో ముఖ్యమైన థియేటర్లలో మంచి వసూళ్లతో నడుస్తోంది. అయితే సెప్టెంబరు 1వ తేదీ రాత్రి కొన్ని థియేటర్లలో ఈ సినిమాను వేయకుండా ‘జల్సా’ సినిమా వేస్తున్నారని టాక్‌. దీని కోసం నిఖిల్‌ కూడా ఓకే అన్నారట. తను ఎంతగానో అభిమానించే కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ కోసమే నిఖిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆయన కోసం తన సినిమా షోలకు పాజ్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే అది ఎన్ని షోలకు, ఎన్ని రోజులకు అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికైతే అక్టోబరు 1వ తేదీ రాత్రి షోల విషయంలోనే ఈ మార్పు ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లో రెండు పవన్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో ఒకటి ‘జల్సా’ అయితే, రెండోది ‘తమ్ముడు’. వినాయకచవితి, పవన్‌ జన్మదినం రెండూ దగ్గర దగ్గరగా రావడంతో నగరంలోని కొన్ని థియేటర్లలో ‘జల్సా’ షోలు వేయాలని నిర్ణయించారు. తొలుత ఈ సినిమా టికెట్లు తెగేలా కనిపించకపోయినా.. ఇప్పుడు చూస్తే అన్నిచోట్లా హౌస్‌ఫుల్స్ కనిపిస్తున్నాయి.

బుక్‌మైషోలోకి వెళ్లి చూస్తే.. గంటగంటలకు కొన్ని థియేటర్లు కొత్తగా యాడ్‌ అవుతున్నాయి. అలా అవ్వడం ఆలస్యం టికెట్లు అమ్ముడైపోయి హాస్‌ఫుల్స్‌ కనిపిస్తున్నాయి. ‘తమ్ముడు’ సినిమాకు షోలు ఆగస్టు 31, సెప్టంబరు 1న ఉండగా.. ‘జల్సా’ సినిమా కోసం సెప్టెంబరు 1, 2 తేదీల్లో ఉన్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus