Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

టాలీవుడ్‌లో మిస్టరీ త్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సిరీస్ ‘కార్తికేయ’. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ఈ రెండు భాగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్ బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టించి, నిఖిల్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. అప్పటి నుంచి ఈ ఫ్రాంచైజీకి డిమాండ్ పెరిగింది.

Nikhil Siddhartha

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ గా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్టోరీ లైన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత రెండు భాగాల్లో చూపించిన అడ్వెంచర్స్‌కు మించి, ఈసారి మరింత భారీ స్థాయిలో ఆధ్యాత్మిక మిస్టరీని రివీల్ చేయబోతున్నారట. ప్రస్తుతం దర్శకుడు పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉండటంతో, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.

హీరో నిఖిల్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘ది ఇండియా హౌస్’, ‘స్వయంభూ’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ పనులు ముగిసిన వెంటనే ‘కార్తికేయ 3’ సెట్స్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సిరీస్ నిఖిల్ కెరీర్‌లోనే ఒక పెద్ద బ్రాండ్‌గా మారడంతో, మూడవ భాగం విషయంలో అస్సలు రాజీ పడకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే సినిమా స్కేల్, బడ్జెట్ విషయంలో ఇప్పుడు పక్కాగా లెక్కలు వేస్తున్నారు.

వరుస విజయాల తర్వాత వస్తున్న పార్ట్ 3 కావడంతో, దీనిపై నేషనల్ లెవల్‌లో అంచనాలు ఉన్నాయి. కేవలం కథ మాత్రమే కాకుండా, టెక్నికల్‌గా కూడా ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలని టీమ్ భావిస్తోంది. సినిమాకు అవసరమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగానే వెచ్చించబోతున్నారట. షూటింగ్ షెడ్యూల్స్ ఇతర కమిట్‌మెంట్స్ అన్నీ ఒక కొలిక్కి వచ్చాక, మూవీ ప్రారంభోత్సవం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus