యాక్షన్ థ్రిల్లర్ గా నిఖిల్ ‘ముద్ర’

2017 లో నిఖిల్ హీరోగా నటించిన ఏకైక చిత్రం కిరాక్‌ పార్టీ’. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కిరిక్ పార్టీ’ చిత్రానికి ఇది రీమేక్.అయితే ఈ చిత్రం తెలుగులో ఆశించిన విజయం సాధించకుండా.. జస్ట్ యావరేజ్ గా నిలిచింది.. టీ.యన్‌. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్’ అండ్ ‘మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి’ బ్యానర్ల పై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ ‘జర్నలిస్ట్’ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. మొదట ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేద్దామని భావించినప్పటికీ కొన్ని కారణాల వలన రిలీజ్ చెయయలేకపోయారు. తాజా సమాచారం ప్రకారం ‘ముద్ర’ చిత్రాన్ని డిసెంబర్ 28 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికార ప్రకటన రావాల్సి ఉంది. నిఖిల్‌ 16వ చిత్రంగా వస్తున్న ‘ముద్ర’ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి,రాజా రవీంద్ర.. తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా… శ్యామ్‌ సీ.ఎస్‌ సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus