2022లో కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ అవ్వడంతో, నిఖిల్‌కు (Nikhil Siddhartha) దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన 18 పేజెస్ (18 Pages) , స్పై (SPY) , అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ, కార్తికేయ 2 లాంటి భారీ హిట్ తర్వాత, నిఖిల్ కెరీర్‌లో బ్రేక్ పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఇండియా హౌస్, మరొకటి పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్వయంభు.
ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లి చాలా కాలమే అయినా, ఇప్పటి వరకు ఎలాంటి మేజర్ అప్డేట్స్ రాలేదు. ఇండియా హౌస్ ఎనౌన్స్‌మెంట్ సమయంలో గ్లింప్స్ వదిలినప్పటికీ, ఆ తర్వాత సినిమా ఎంతవరకు వచ్చింది అనే క్లారిటీ లేదు. అలాగే స్వయంభు (Swayambhu) సినిమా గురించి కూడా అంతగా ప్రచారం జరగడం లేదు. సాధారణంగా, పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ కాస్త ముందుగానే ప్రారంభించాలి.
కానీ, నిఖిల్ సినిమాలు ఇప్పటికీ సైలెంట్ మోడ్‌లోనే ఉండటంతో, ప్రేక్షకుల్లో కనెక్ట్ తగ్గిపోతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ ఆయన కొన్ని సినిమాలను ఆలస్యం చేశాడు. కానీ, కార్తికేయ 2 తర్వాత రాబోయే సినిమాలపై అంతగా బజ్ లేకపోవడం నిఖిల్ అభిమానులకు అసలు నచ్చడం లేదు. అసలు నిఖిల్ సినిమాల పరిస్థితి ఏంటి? ఈ గ్యాప్ వల్ల అతని మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తను చేస్తున్న సినిమాలు పూర్తయ్యే వరకు ప్రమోషన్ చేయకూడదనే స్ట్రాటజీలో ఉన్నాడా లేక సినిమాలు కొన్ని సమస్యల వల్ల ఆలస్యం అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. కానీ, కార్తికేయ 2 స్థాయిలో క్రేజ్‌ను కొనసాగించాలంటే, నిఖిల్ ఇప్పటినుంచే తన సినిమాలకు హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.