Court Collections: 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘కోర్ట్’..!

నాని (Nani)  సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది ఉప శీర్షిక. ‘కథలెన్నో’ అనే పాట, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీత దర్శకుడు. రామ్ జగదీష్ దర్శకుడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల ముందే ప్రిమియర్స్ కూడా వేశారు.

Court Collections

మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. హోలీ పండుగ సెలవు ఈ సినిమాకి కలిసొచ్చింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.35 కోట్లు
సీడెడ్ 0.38 కోట్లు
ఆంధ్ర(టోటల్) 1.16 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.89 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
1.4 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 4.29 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు రూ.4.29 కోట్ల షేర్ ను రాబట్టి 50 శాతం పైనే రికవరీ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

నిరాశపరిచిన ‘దిల్ రూబా’ ఓపెనింగ్స్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus