‘స్పై’ తర్వాత నిఖిల్(Nikhil Siddhartha) మరో సినిమా చేయలేదు. అప్పుడెప్పుడో చేసి మధ్యలో ఆపేసిన ఓ సినిమాని ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ పేరుతో హడావిడిగా రిలీజ్ చేసి వదిలారు.దాని ఫలితం కూడా అందరికీ తెలిసిందే. అయితే ‘స్పై’ తర్వాత అఫీషియల్ గా నిఖిల్ చేస్తున్న సినిమా అంటే.. ‘స్వయంభూ’ అనే చెప్పాలి. ఇది ఒక పీరియాడిక్ మూవీ. 2023 లో మొదలైంది. ఈ ఫిబ్రవరి 14 కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కానీ ఆ టైంకి కూడా సినిమా రిలీజ్ కావడం లేదు. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు.ఇది పీరియాడిక్ సినిమా. కాబట్టి.. సెట్స్ వాటి తాలూకా.. వి.ఎఫ్.ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజుల్లో వీఎఫ్ఎక్స్ విషయంలో సినిమాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటి ఔట్పుట్ ఏమాత్రం తేడా కొట్టినా ట్రోలింగ్ భారిన పడి.. సినిమా దారుణంగా ప్లాప్ అవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
‘స్వయంభు’ విషయంలో అలా జరగకూడదు అనే ఉద్దేశంతో సినిమాని వాయిదా వేశారు మేకర్స్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 కి సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ డేట్ కి అయినా సినిమా వస్తుందా అనేది అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. నిఖిల్ మార్కెట్ కి మించి… బడ్జెట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు వీ.ఎఫ్.ఎక్స్ కోసం మరో రూ.15 కోట్లు ఖర్చుపెట్టాలి అని తెలుస్తుంది. రిలీజ్ కోసం ప్రమోషన్ వంటి వ్యవహారాల కోసం ఇంకో రూ.10 కోట్లు అనుకున్నా.. మొత్తంగా రూ.25 కోట్ల వరకు పెట్టాల్సి ఉంటుంది.