నిఖిల్ ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ అక్టోబ‌ర్ లో విడుద‌ల‌

‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’, ‘సూర్య vs సూర్య’ లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో ‘అట్ట‌క‌త్తి’, ‘ముందాసిప‌త్తి’, ‘ఎధిర్ నీచ‌ల్’ లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెద‌టిలుక్ కి విప‌రీత‌మైన స్పంద‌న రావ‌టం తెలిసిన విష‌య‌మే. చూసిన ప్ర‌తిఓక్క‌రూ టైటిల్ చాలా వినూత్నంగా వుంద‌ని సోష‌ల్ మీడియాలో వారి స్పంద‌న‌లు తెలిపారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని  ‘టైగ‌ర్’ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు.  మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిక్‌మంగ్‌లూర్ లో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి టోట‌ల్ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,
ఆర్ట్‌- రామాంజ‌నేయులు,
ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,
సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,
మాట‌లు- అబ్బూరి ర‌వి
డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,
నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌
స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus