నిక్కీతో మరోమారు రొమాన్స్ చేయనున్న ఆది!

తమ పక్కన ఒకసారి నటించిన కథానాయికను మరోమారు రిపీట్ చేయడం అనేది సర్వసాధారణం. ఒకప్పుడు కేవలం హిట్టయితేనే ఈ రిపిటీషన్లు జరిగేవి. కానీ.. ఈమధ్య హిట్టు, ఫ్లాపుతో సంబందం లేకుండా సదరు హీరోయిన్ తో కెమిస్ట్రీ కుదిరితే చాలు రిపీట్ చేసేస్తున్నారు మన హీరోలు. చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నప్పటికీ.. అవి ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.

ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా సభ్యత్వం తీసుకొన్న యువ కథానాయకుడు ఆది. ఇటీవల “సరైనోడు” సినిమాతో విలన్ గా నటించి మంచి మార్కులు సంపాదించుకొన్న ఆది, తమిళంలో శరవనణ్ అనే ఓ కొత్త దర్శకుడి నిర్దేశకత్వంలో ఓ సినిమా చేసేందుకు సమ్మతించాడు. ఈ సినిమాలో కథానాయికగా తనతో “మలుపు” అనే ఓ యావరేజ్ హీట్ గా నిలిచిన సినిమాలో జంటగా నటించిన నిక్కీ గల్రానిని ఎన్నుకొన్నాడు. ఈ సినిమా జూలై నుంచి సెట్స్ కు వెళ్లనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus