సందీప్.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు…!

సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక్ రాజు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో అన్య సింగ్ హీరోయిన్ గా నటించింది. ‘మిర్రర్ మిస్టరీ’ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ నే దక్కించుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. అయితే అంతే ఇంట్రెస్టింగ్ గా సెకండ్ హాఫ్ ను మలచడంలో విలమయ్యాడు. ఓవర్ ఆల్ గా సినిమా ఎంగేజింగ్ గానే సాగింది. తమన్ సంగీతం ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పాలి. ఇక డీసెంట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి 1.70 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. మొదటి రోజు కూడా మంచి టాక్ రావడంతో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ నమోదుచేశాయి. ఇక ఇప్పటి వరకూ శని, ఆదివారాలకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. వీకెండ్ ను కచ్చితంగా ఈ చిత్రం క్యాష్ చేసుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సందీప్ కిషన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం హీరో సందీప్ కిషన్ కు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఆయన నటించిన గత చిత్రాలు ఈ చిత్రం సాధించిన కలెక్షన్లలో సగం కూడా రాలేదు. మొదటి నుండీ ఈ చిత్రానికి మంచి ప్రమోషన్లు నిర్వహించి మంచి ఓపెనింగ్స్ ను సాధించాడు. మరి ఓవర్ ఆల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus